- మతం మారినా కులాన్ని తగిలించుకుని లాభాలు పొందుతున్నారు
- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Vijayasai Reddy Sensational Comments | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు వి. విజయసాయిరెడ్డి మతం మార్పిడులు, కుల రాజకీయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొందరు వ్యక్తులు మతం మారినప్పటికీ, తమ పాత కుల గుర్తింపును వదిలిపెట్టకుండా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
‘మతం మారినా కులాల అండ’..
ఓసీ (OC) సామాజిక వర్గాల్లోని ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది మతం మారుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మతం మారిన తర్వాత కూడా వారు తమ కులాన్ని వదిలిపెట్టకుండా, పేరు చివర ఆ కులాల పేర్లను తగిలించుకుని వేరే మత వ్యవస్థలను నడిపిస్తున్నారని మండిపడ్డారు.
దీని ద్వారా ఆర్థికంగా, అధికారికంగా, రాజకీయంగా భారీ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ మతంలో సగం కంటే ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల వారేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read Also: ‘హెచ్-1బి, విద్యార్థి వీసాలపై ట్రంప్ సర్కార్ కఠిన చట్టాలు’:
‘సనాతన ధర్మంపై దాడి చేస్తే ఉరిశిక్ష వేయాలి’
భారతీయ సంస్కృతి, హిందూ మతంపై జరుగుతున్న విమర్శలపై విజయసాయిరెడ్డి అత్యంత కఠినమైన చట్టాల అవసరాన్ని నొక్కి చెప్పారు.
“అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, హిందూ మతం మీద, దేశం మీద ఎవరు తప్పుడు వ్యాఖ్యలు చేసినా.. వారు ఏ కులానికి, ఏ మతానికి చెందినవారైనా సరే.. సామాజికంగా, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించేలా అవసరమైతే ప్రభుత్వం చట్టాలను సవరించాలి” అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రకాశ్ రాజ్, రావణ్‌లపై వ్యాఖ్యలు..
సినిమా నటుడు ప్రకాశ్ రాజ్, రావణ్ వంటి వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా సమర్థించడాన్ని విజయసాయిరెడ్డి తప్పుబట్టారు.
వారిని సమర్థించడం అంటే.. నేరుగా హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద వారు చేస్తున్న దాడిని సమర్థించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఇలాంటి ఆలోచనలను ‘మతపరమైన ఉగ్రవాదం’ (Religious Terrorism) గా భావించాలని ఆయన అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.







