Thursday 9th July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > టమాట తోటలో ఉద్యోగం.. ఫ్రీగా టీ, కూల్ డ్రింక్స్’ జీతం ఎంతంటే!

టమాట తోటలో ఉద్యోగం.. ఫ్రీగా టీ, కూల్ డ్రింక్స్’ జీతం ఎంతంటే!

  • సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Jobs In Tomato Farm | ఉద్యోగాల వేటలో ఉన్న వారికి సోషల్ మీడియా ఒక కొత్త వేదికగా మారుతోంది. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ల నడుమ.. తాజాగా ఓ మహిళ తన ‘టమోటా తోట’లో పని చేయడానికి ఉద్యోగులు కావాలంటూ చేసిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

ఆకర్షణీయమైన జీతంతో పాటు అదనపు సౌకర్యాలను కూడా ప్రకటిస్తూ ఆమె చేసిన ఆఫర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆసక్తి గల అభ్యర్థులు ఈ తోట పనుల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సదరు మహిళ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆమె ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నెలవారీ జీతం: ఈ ఉద్యోగంలో చేరిన వారికి నెలకు రూ. 12,000 ఫిక్స్‌డ్ సాలరీ లభిస్తుంది.

పని వేళలు (షిఫ్ట్): ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు (8 గంటల పని వేళలు) తోటలో పనిచేయాల్సి ఉంటుంది.

ఉచితంగా లభించే అదనపు సదుపాయాలు: ఉద్యోగులకు ప్రతిరోజూ ఉదయం వేడివేడి టీ, మధ్యాహ్నం సేదతీరడానికి కూల్ డ్రింక్ ఉచితంగా అందిస్తారు.

ఇవే కాకుండా, తోటలో పండే రకరకాల పళ్ళు, తాజా కూరగాయలను కూడా కార్మికులు తమ ఇంటికి ఉచితంగా తీసుకువెళ్లవచ్చని ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Read Also: యువ జంట ఆదర్శ వివాహం.. కట్నం ఎంతో తెలుసా!

ఒక నెల పాటు ఉచిత శిక్షణ..

ఈ తోటలో ఎలాంటి పనులు చేయాలి, ఎలా చేయాలో తెలియని వారి కోసం సదరు యజమాని ప్రత్యేక ఏర్పాటు చేశారు. తోటలో చేరిన వారికి మొదటి ఒక నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ (Training) ఇస్తామని మహిళ తెలిపారు.

ఈ శిక్షణ కాలంలో.. టమాటో మొక్కలు నాటడం, వాటికి ఆధారంగా పురి కట్టడం (తాళ్లతో కట్టడం), అలాగే పండిన కాయలను జాగ్రత్తగా కోయడం వంటి పనులపై పూర్తి అవగాహన కల్పిస్తారు.

“ఇలాంటి అద్భుతమైన ఉద్యోగావాకాశం, మంచి సదుపాయాలు మళ్లీ మళ్లీ రావు.. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి” అని ఆ మహిళ సదరు వీడియోలో కోరారు.

వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ తరహాలో ఉచిత శిక్షణ, అదనపు ప్రయోజనాలతో కూడిన ఆఫర్లు ఇస్తుండటంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో పని చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

You may also like
kerala influencer arrested
కేరళ ఘటన: ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్!
delivery boy saves woman life in tn
ఓ ప్రాణం నిలబెట్టిన డెలీవరీ బాయ్..
couple adoption journey
కపుల్ అడాప్షన్ జర్నీ.. నెటిజన్ల మనసు హత్తుకున్న వైరల్ వీడియో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions