Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!

ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!

Telangana Muncipal Election Results | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అయితే ప్రచార సమయంలో కొందరు అభ్యర్థులు చర్చనీయాంశంగా మారారు. ఇందులో ఒకరు మొయినాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి. ఒక్క ఓటుకు రూ.70 వేలు, పట్టు చీర, 25 కేజీల బియ్యం, పప్పుదినుసులు పంచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఓ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కాగా శుక్రవారం వెలువడిన ఫలితాల్లో సదరు అభ్యర్థి ఘన విజయం సాధించారని కథనాలు వస్తున్నాయి.

200 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందడం విశేషం. మొయినాబాద్ మున్సిపాలిటీలో ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఛైర్మన్ ఎన్నికల్లో వీరే కీలకం కానున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుండి మంచి ఆకట్టుకునే ఆఫర్లు రావడం ఖాయం. ఇదిలా ఉండగా మొయినాబాద్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికం. ఈ క్రమంలోనే సదరు అభ్యర్థి ఇంతలా ఖర్చు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions