Friday 5th June 2026
12:07:03 PM
Home > తాజా > మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కీలక నిర్ణయం!

మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కీలక నిర్ణయం!

tgsrtc green metro

Bus Pass For Women | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) లో భాగంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆధార్ కార్డు ప్రామాణికంగా జీరో టికెట్ (Zero Ticket) ఇస్తున్నారు. తాజాగా ఈ జీరో టికెట్ స్థానంలో ఉచిత బస్ పాస్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ సమీక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న‌ట్లు ఆర్టీసీ జేఏసీ వెల్ల‌డించింది. ఈ నిర్ణ‌యం పట్ల ఆర్టీసీ జేఏసీ కూడా హర్షం వ్యక్తం చేసింది.

ఉచిత‌ బ‌స్సు సౌక‌ర్యం కోసం మహిళలు పోటెత్తుతుండడంతో జీరో టికెట్ జారీ చేసే సమయంలో కండక్టర్ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీరో టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన‌ట్లు జేఏసీ తెలిపింది.   

You may also like
tgsrtc
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..ప్రభుత్వం క్లారిటీ!
seetharamaula thalambralu
శ్రీరామ భక్తులకు శుభవార్త.. ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు!
tgsrtc
మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!
tgsrtc green metro
ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions