Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > హైదరాబాద్ లో ప్రముఖ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం!

హైదరాబాద్ లో ప్రముఖ ఆలయానికి నీతా అంబానీ రూ. కోటి విరాళం!

nita ambani


Nitha Ambani Donates | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nitha Ambani) తెలంగాణలోని బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma Temple) ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తన తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతతో కలిసి ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి కృష్ణ ఆలయ విశిష్టతను నీతా అంబానికి వివరించి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో నీతా అంబానీ ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేసి, దాని ద్వారా వచ్చే వడ్డీతో రోజూ అన్నదానం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు. కాగా, జూలై 1 నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవం జరుగనుంది.

You may also like
fire accident in chanda nagar
HYDలో మరో ఫర్నీచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం!
sridhar babu
గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు
fire accident in nampally
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం!
United In Triumph
అంధ మహిళల క్రికెట్ జట్టుకు రిలయన్స్ భారీ నజరానా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions