Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ వేడుకలు!

ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ వేడుకలు!

yoga day

Yoga Day Countdown In LB Stadium | జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా హైదరాబాద్ లో 24 గంటల ముందు నుంచే ప్రత్యేక యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రముఖ నటినటులు సాయిధరమ్‌తేజ్, ఖుష్బూ, మీనాక్షి చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ప్రముఖులంతా యోగాసనాలు వేశారు.

శనివారం ప్రపంచవ్యాప్తంగా యోగా డే నిర్వహించనున్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్‌తో ఈ ఏడాది యోగా డే నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్బంగా విశాఖపట్నంలో ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖలోని ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు మొత్తం 127 కంపార్ట్‌మెంట్లలో యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు అధికారులు భారీ ప్రణాళికలు రూపొందించారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమంది చొప్పున పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ యోగాంధ్ర సందర్భంగా మొత్తం 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించే లక్ష్యం నిర్దేశించుకకుంది ఏపీ ప్రభుత్వం.  

You may also like
fire accident in chanda nagar
HYDలో మరో ఫర్నీచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం!
BJP Kishan REddy
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలి: కిషన్ రెడ్డి
BJP Kishan REddy
రాజకీయ స్రవంతిలోకి మావోయిస్టులు..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
sridhar babu
గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions