Sunday 6th September 2026
12:07:03 PM
Home > తాజా > తొలి మహిళా కండక్టర్లకు ఆర్టీసీ సన్మానం

తొలి మహిళా కండక్టర్లకు ఆర్టీసీ సన్మానం

RTC MD Sajjanar Felicitated Women Conductors | తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ స‌న్మానించింది. ఆర్టీసీలో తొలి మ‌హిళా కండ‌క్ట‌ర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్త‌మ స‌ర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని ఆర్టీసీ ఎండి సజ్జనర్ అభినందించారు.

హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోన‌కు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిప‌ట్నం డిపో శార‌ద‌ను సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ స‌న్మానించారు. ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి వారికి ప్ర‌శంసాప‌త్రాల‌ను అంద‌జేశారు.

ఎన్నో ఏళ్లుగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తోన్న మ‌హిళా కండ‌క్ట‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన అసోసియేష‌న్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ‌ర్ టేకింగ్స్(ASRTU) అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఇటీవ‌ల న్యూఢిల్లీలో స‌త్క‌రించింది.

అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండ‌క్ట‌ర్లు శ్రీదేవి, అనిత, శార‌ద ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీలో వారి సేవ‌ల‌ను కొనియాడుతూ యాజ‌మాన్యం స‌న్మానించింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions