Monday 25th May 2026
12:07:03 PM
Home > తాజా > గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

sridhar babu

Hyerabad As Global Value Creation Hub | హైదరాబాద్‌ను ఐటీతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్ కేర్ వంటి పలు రంగాల్లో ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ బీమా దిగ్గజం ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్’ ను ఆయన ప్రారంభించారు.1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 1200 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇది ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌పై దృష్టి సారిస్తూ ‘ఇంజనీరింగ్ ఎక్స్‌లెన్స్ హబ్’గా పనిచేస్తుంది.పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు.

నగరంలో ఇప్పటికే మారియట్, యూబీఎస్ వంటి 400కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) ఉన్నాయని, వీటిని కేవలం బ్యాక్ ఎండ్ ఆపరేషన్లకే కాకుండా వాల్యూ సెంటర్లుగా మారుస్తున్నామని పేర్కొన్నారు.

పారదర్శక పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల అంతర్జాతీయ సంస్థలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫోర్డ్ ప్రతినిధులు మోరిస్ టూకర్, సూర్య తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions