Sunday 9th August 2026
12:07:03 PM
Home > తాజా > నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం!

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం!

fire accident in nampally

fire accident in nampally furniture store | హైదరాబాద్ నాంపల్లి (Nampally Fire Accident) లోని ఓ ఫర్నీచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. బచ్చా క్యాజిల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి.

ప్రమాదం మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో సంభవించించింది. ఆపై నాలుగు అంతస్తులకు విస్తరించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ క్రేన్లు చేరుకున్నాయి. భవనం లోపల ఇద్దరు చిన్నారులు, నలుగురు పెద్దలు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు.

స్కైలాడర్ ద్వారా నాలుగో అంతస్తు అద్దాలను పగులగొట్టి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనం పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ఫర్నిచర్ దుకాణంలోని సెల్లార్‌లో ఫర్నిచర్ నిల్వ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

అగ్ని ప్రమాద ప్రాంతంలో పోలీసులు, హైడ్రా సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను అక్కడి నుంచి తరలించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions