Rajinikanth Health Update | సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Rajnikanth) సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయణ్ని చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు.
పలువురు ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందించారు. ప్రస్తుతం రజినీకాంత్ కు ఓ మైనర్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. పొత్తికడుపు కింది భాగంలో స్టెంట్ వేసినట్లు సమాచారం.
ఆపరేషన్ విజయవంతమైనట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు.