Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నరు. ఈ మేరకు తాజాగా అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడం టుస్సాడ్స్ మ్యూజియం టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
సింగపూర్ లోని మ్యూజియంలో రామ్ చరణ్ తోపాటు ఆయన పెంపుడు కుక్క రైమీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహ తయారీకి సంబంధించి ఫొటో షూట్ కూడా ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ట్వీట్ చేశారు. టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. మేడమ్ టుస్సాడ్స్ లో ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.