NTR Emotional Tweet On Devara | ఎన్టీఆర్ (NTR) కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. దేవర సినిమా పై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానను.
కొరటాల శివ గారూ, ఇంత అద్భుతమైన డ్రామా ఎమోషనల్ ఎక్సీపియన్స్ తో దేవరను ఊహించినందుకు థాంక్యూ. నా బ్రదర్ అనిరుధ్.. మీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి జీవం పోశాయి.
నిర్మాతలు హరికృష్ణ కొసరాజు గారికి మరియు సుధాకర్ మిక్కిలినేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డీవోపీ రత్నవేలుసర్, సాబుసిరిల్, శ్రీకర్ ప్రసాద్, మరియు ప్రతి టెక్నీషియన్ కి పత్యేక కృతజ్ఞతలు. నా అభిమానులకు, దేవార కోసం మీరు జరుపుకుంటున్న వేడుకలతో నా మనసు ఉప్పొంగుతోంది.
మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాలా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషం. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను’ అని ఫ్యాన్స్ ఉద్దేశించి పోస్ట్ చేశారు ఎన్టీఆర్.