Devara Ticket Price | యంగ్ టైగర్ ఎన్టీయార్ (jr ntr), కొరటాల శివ (koratala siva) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం దేవర(devara). భారీ బడ్జెట్ పై చిత్రీకరించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులు ఇచ్చాయి. ఆంధ్రలో మొదటి 14 రోజులు అధిక ధరకు టికెట్లు అమ్ముకునేందుకు జీవో ఇచ్చింది.
అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఓ కమిటీ రిపోర్ట్ ఉందని పిటిషనర్ వాదనలు తన వినిపించాడు.
పిటీషనర్ వాదనతో ఏకీభవిస్తూ టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
కాగా తెలం గాణాలో మొదటి రోజు మాత్రం ఒకరేటు, మిగిలిన 9 రోజులు మరొక రేట్ కు టికెట్ ధరలు నిర్ణయించింది. అయితే రెండవ రోజు నుండి ఇచ్చిన ధరలను మరి కొంత పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి దేవర నిర్మతలు మరోసారి దరఖాస్తు చేసుకున్నారు.