Thursday 15th October 2026
12:07:03 PM
Home > క్రీడలు > హార్దిక్ పాండ్య వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం !

హార్దిక్ పాండ్య వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం !

Hardik Pandya Flaunts Ultra-Rare Richard Mille Watch – Worth Rs.20 Crore | హార్దిక్ పాండ్య ధరించిన అత్యంత ఖరీదైన వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వాచ్ ధర ఏకంగా ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధికంగా ఉండడం ఆసక్తిగా మారింది.

ఆసియా కప్-2025 కు సర్వం సిద్ధమయ్యింది. మంగళవారం నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బుధవారం టీం ఇండియా ఆతిథ్య యూఏఈ తో తలపడనుంది. కాగా భారత ఆటగాళ్లు ఇప్పటికే దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో హార్దిక్ పాండ్య రూ.20 కోట్లు విలువ చేసే ఖరీదైన వాచ్ ను ధరించి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఈ వాచ్ లగ్జరీ బ్రాండ్ అయిన రిచర్డ్ మిల్లె కు చెందింది. హార్దిక్ ధరించిన రిచర్డ్ మిల్లె ఆర్ఎం 27-04 ధర రూ.20 కోట్లు ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వాచీలు కేవలం 50 మాత్రమే ఉన్నాయి. టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నడాల్ సహకారంతో ఈ వాచ్ ను రూపొందించారు.

స్ట్రాప్ తో కలిపి ఈ వాచ్ బరువు కేవలం 30 గ్రాములే ఉంటుంది. మరోవైపు ఆసియా కప్ 2025 ప్రైజ్ మనీ రూ.2.6 కోట్లు. అంటే ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధికంగా ఈ వాచ్ ధర ఉంది.

అలాగే ఆసియా కప్ కోసం పాకిస్థాన్ 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ ఆటగాళ్ల వార్షిక జీతం మొత్తం రూ.19 కోట్లు. అంటే హార్దిక్ ధరించిన వాచ్ ధర పాకిస్థాన్ ఆటగాళ్ల వార్షిక జీతం కంటే ఎక్కువ.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions