Jayam Ravi Complaints Against his Wife | కోలీవుడ్ లో స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలసిందే. తన భార్యతో 15 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అయితే ఆయన భార్య ఆర్తి తన అంగీకారం లేకుండా తన భర్త విడాకుల ప్రకటన చేశాడంటూ ఇన్‌స్టా వేదికగా స్టేట్‌మెంట్ పెట్టారు. పెట్టి అం దరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా జయం రవి తన భార్య ఆర్తి పై చెన్నై అడయార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ ఫిర్యాదులో తన భార్య తనను ఇంటి నుంచి గెంటి వేశారని పేర్కొన్నట్లు కోలీవుడ్ లో సమాచారం వైరల్ అవుతోంది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్‌లో ఉన్న ఆర్తి ఇంటి నుండి తన వస్తువులను తిరిగి ఇవ్వాలని జయం రవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జయం రవి 2009లో ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా ఇన్నేళ్లకి విడాకులు తీసుకోవడానికి జయం రవి ఒక సింగర్‌తో రిలేషన్‌లో ఉండటమే కారణం అని సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.