Monday 28th July 2025
12:07:03 PM
Home > తాజా > పెళ్లి ఎప్పుడో చెప్పేసిన కీర్తి సురేష్

పెళ్లి ఎప్పుడో చెప్పేసిన కీర్తి సురేష్

Keerthy Suresh To Marry Antony In Goa Next Month | చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ ( Antony )ని నటి కీర్తి సురేష్ వివాహం చేసుకోనుందనే విషయం తెల్సిందే.

సోషల్ మీడియా ( Social Media ) ద్వారా స్వయంగా కీర్తినే ఈ విషయాన్ని ప్రకటించింది. తాజగా పెళ్లి ఎప్పుడు జరగనుందో అనే విషయం పై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం కీర్తి సురేష్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడారు. వచ్చే నెలలో తన పెళ్లి జరగనున్నట్లు చెప్పారు. గోవా ( Goa )లో వివాహవేడుక జరగనుందన్నారు.

అంతేకాకుండా వచ్చే నెలలో తన హిందీ సినిమా కూడా విడుదల అవుతుందని తెలిపారు. అందుకోసమే స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.

You may also like
కేవలం 22 నిమిషాల్లో ‘ఆపరేషన్ సింధూర్’ పూర్తి
బాబోయ్.. కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్! ఇంతకీ దాని పేరేంటో తెలుసా!
‘ట్రంప్ ముందు నిల్చోగానే మోదీ ఎత్తు ఐదు ఫీట్లకు తగ్గుతుంది’
యెమెన్ లో నిమిష ప్రియ కుటుంబ సభ్యులతో కేఏ పాల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions