Nagababu Latest Post | జనసేన నాయకులు, మెగా బ్రదర్ ( Mega Brother )నాగబాబు ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి.
దింతో నాగబాబును రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) మంతనాలు జరుపుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఒక పోస్ట్ చేశారు.
‘ అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు . అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ ప్రయోజనాలకోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాలకోసం. అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాకు ఎటువంటి రాజకీయ పదవుల కాంక్ష లేదు.’ అంటూ నాగబాబు పోస్ట్ ( Post ) చేశారు