Monday 9th December 2024
12:07:03 PM
Home > తాజా > అత్యధిక రన్ టైం ఉన్న సినిమాల లిస్టులో పుష్ప-2

అత్యధిక రన్ టైం ఉన్న సినిమాల లిస్టులో పుష్ప-2

Pushpa-2 Movie Run Time News | అల్లు అర్జున్ ( Allu Arjun ), రష్మిక ( Rashmika ) జంటగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ పుష్ప-2 ది రూల్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ( Songs ), ట్రైలర్ ( Trailer ) ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి.

డిసెంబర్ 5న పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పుష్ప-2 రన్ టైం ( RUN TIME ) పై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. సినిమా నిడివి కచ్చితంగా మూడు గంటల పైనే ఉంటుందని పలువురు కామెంట్లు చేశారు.

వారి అంచనాలను నిజం చేస్తూ పుష్ప-2 రన్ టైం పై ఓ క్లారిటీ వచ్చింది. మూడు గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివితో సినిమా రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తి అయింది. పుష్పకు U/A సర్టిఫికెట్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లోనే అత్యధిక రన్ టైం కలిగిన మూడవ సినిమాగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. స్వర్గీయ ఎన్టీఆర్ ( NTR )సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ‘ దాన వీర సూర కర్ణ ‘ 3 గంటల 46 నిమిషాలతో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండగా, 3 గంటల 28 నిమిషాల నిడివితో ‘ లవకుశ ‘ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత మూడు గంటల 20 నిమిషాల రన్ టైం తో పుష్ప-2 థర్డ్ ప్లేస్ ( Third Place ) లో నిలిచింది.

You may also like
ktr
‘సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం?’ : కేటీఆర్
manchu family
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు?
allu amitabh
‘ఐకాన్ స్టార్ మేమంతా మీ అభిమానులమే’: అమితాబ్ బచ్చన్
ponnam prabhakar
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్ కు మంత్రి ఆహ్వానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions