Ram Gopal Varma Latest News | పోలీస్ కేసుల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవి ( RGV ) స్పందించారు.
నా కేసు అంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘ నేను ఏదో పరారీలో ఉన్నాను మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ( Bad News ).. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు ( Office ) లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.
ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు?’ అంటూ ఆయన ప్రశ్నించారు. కానీ తనపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవ్వడం తనకు మరియు తన మనుషులకు అనుమానాన్ని కలగచేసిందన్నారు.