Telangana Govt. Cancels Land Acquisition In Lagacharla | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ ( Vikarabad ) జిల్లా దుద్యాల మండలం లగచర్ల ( Lagacharla ) గ్రామంలో ఫార్మా విలేజ్ కోసం తలపెట్టిన భూసేకరణ నోటిఫికేషన్ ను తాజగా ప్రభుత్వం రద్దు చేసింది.
భూసేకరణ నోటిఫికేషన్ ( Notification ) ను ఉపసంహరించుకుంటు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా విలేజ్ కోసం లగచర్ల గ్రామంలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూమిని సేకరించేందుకు ఆగస్ట్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామంలో తీవ్ర నిరసన వ్యక్తం అయిన విషయం తెల్సిందే. అంతేకాకుండా వికారాబాద్ కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులపై దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.
సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్ ( Kodangal ) నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజగా భూసేకరణను ప్రభుత్వం రద్దు చేసింది.
అయితే ఫార్మా విలేజ్ ( Pharma Village ) కారణంగా కాలుష్యం పెరుగుతుందనే భయంతో గ్రామస్థులు వ్యతిరేకించారని, ఫార్మా విలేజ్ స్థానంలో టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.