Asifabad Tiger Attack News | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ పులి దాడి చేయడంతో యువతి మృతి చెందింది.
వివరాల్లోకి వెళ్తే కాగజ్ నగర్ ( Kagaznagar ) మండలం బెంగాలి క్యాంప్ 6 నెంబర్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోర్లే లక్ష్మి పై పులి దాడి చేయడంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది.
ఘటన జరిగే సమయంలో కొద్దీ దూరంలోనే కొందరు కూలీలు ఉన్నారు. వారు కేకలు వేసినా యువతిపై పులి దాడి మాత్రం ఆగలేదు. యువతిపై దాడి చేసిన అనంతరం పులి అడవిలోకి వెళ్ళిపోయింది.
లక్ష్మీ మృతదేహంతో బంధువులు కాగజ్ నగర్ లోని అటవీశాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.