Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఈ రోడ్డుకు ఏమైంది..జారిపడుతున్న బైకులు!

ఈ రోడ్డుకు ఏమైంది..జారిపడుతున్న బైకులు!

12 Bikes Skid on a road Within Minutes in uttar pradesh

12 Bikes Skid Within Minutes | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. దింతో క్షణాల వ్యవధిలోనే డజన్ల కొద్దీ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

దీంతో అసలు ఈ రోడ్డుకు ఏమైంది అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే యూపీ లోని అమ్రోహ జిల్లాలో ధనౌరా-అమ్రోహ సర్వీస్ రోడ్డు వసంత పంచమి నాడు అత్యంత భయంకరంగా మారింది. కార్లు, లారీలు ఇతర వాహనాలు రోడ్డుపై సులభంగానే వెళ్లిపోయాయి.

అయితే ద్విచక్ర వాహనదారులు మాత్రం తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సాయంత్రం వేళ అయితే ఈ పరిస్థితి దారుణంగా మారింది. కేవలం క్షణాల వ్యవధిలోనే పదుల సంఖ్యలో బైకులు అదుపుతప్పి కిందపడిపోయాయి. దింతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ముందు ఈ రోడ్డుపై చెరుకు పరిశ్రమకు ద్రవ చెందిన వ్యర్ధాలు పడిపోయాయి. ఆ తర్వాత ఉదయం తేలికపాటి వర్షం పడడంతో రోడ్డులోని కొంతభాగం పూర్తిగా జారుడుగా మారిపోయింది.

అలాగే వాహనాలను అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలోనే డజన్ల కొద్దీ వాహనాలు అదుపుతప్పి ఇలా పడిపోయాయి. అనంతరం అధికారులు రోడ్డును శుభ్రం చేయడంతో వాహనాలు ఎప్పటిలాగే వెళ్లిపోయాయి.

You may also like
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions