Pushpa-3 Movie Updates | పుష్ప-1 ది రైజ్ ( Pushpa-1 The Rise ) బ్లాక్ బస్టర్ అయ్యింది. పుష్ప-2 ది రూల్ ( Pushpa-2 The Rule ) విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో పుష్ప-3 పై కూడా అనేక ఊహాగానాలు వినిపించాయి.
సోమవారం జరిగిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ మరో మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తే పుష్ప-3 కూడా ఉంటుందని దర్శకుడు సుకుమార్ స్పష్టం చేశారు.
మరోవైపు పుష్ప-3 టైటిల్ కి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. పుష్ప-2 కి సౌండ్ ఇంజినీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీంతో దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వెనుకాల పుష్ప-3 ది ర్యాంపేజ్ ( Pushpa-3 Rampage ) అని రాసి ఉంది. దింతో పుష్ప-3 త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశం మాత్రం లేదు. దీనికి కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కు ఇతర సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయి.
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ( Berlin Film Festival ) సందర్భంగా పుష్ప-3 ఉంటుందని అల్లు అర్జున్ కూడా ప్రకటించారు. తాజగా విడుదలైన పుష్ప-3 ర్యాంపేజ్ ఫోటో తెగ వైరల్ గా మారింది.