Thursday 9th July 2026
12:07:03 PM
Home > క్రైమ్ > యూట్యూబ్ చూసి ‘హోమ్‌మేడ్ వైన్’ దందా!

యూట్యూబ్ చూసి ‘హోమ్‌మేడ్ వైన్’ దందా!

  • కాప్రాలో అక్రమ తయారీ కేంద్రం గుట్టురట్టు..
  • 7 ఫ్లేవర్ల వైన్ స్వాధీనం!

Man Makes Wine Using YouTube | ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక యూట్యూబ్‌ (YouTube) చూసి కొత్త కొత్త వంటకాలు, ప్రయోగాలు చేయడం కామన్‌గా మారింది. కానీ, అదే యూట్యూబ్‌ను ఆసరాగా చేసుకుని ఏకంగా ‘హోమ్‌మేడ్ వైన్’ తయారీ కేంద్రం తెరిచాడో ప్రెజెంట్ కిలాడీ.

ఎలాంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండా, గత ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల మధ్యే వైన్ తయారు చేస్తూ అక్రమ దందా సాగిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

7 రకాల ఫ్లేవర్లతో ఇల్లే వైన్ ఫ్యాక్టరీ..

కాప్రా ప్రాంతానికి చెందిన ఆంటోనీ పీటర్ అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. యూట్యూబ్‌లో వచ్చే వివిధ రకాల వీడియోలను క్షుణ్ణంగా చూసి వైన్ తయారీ ప్రక్రియను నేర్చుకున్నాడు.

Read Also: టమాట తోటలో ఉద్యోగం.. ఫ్రీగా టీ, కూల్ డ్రింక్స్’ జీతం ఎంతంటే!

కేవలం ద్రాక్షతోనే కాకుండా.. అనాస (పైనాపిల్), జామ, బత్తాయి, సపోటా, అరటిపండు మరియు విభిన్నంగా తమలపాకులతో కలిపి మొత్తం 7 రకాల ఫ్లేవర్లలో ఈ వైన్‌ను సొంతంగా తయారు చేయడం ప్రారంభించాడు.

ఇలా ఇంట్లోనే తయారు చేసిన వైన్‌ను ఆకర్షణీయమైన సీసాలలో ప్యాక్ చేసి.. నేరేడ్‌మెట్, సికింద్రాబాద్, కాప్రా పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు ఎలాంటి అనుమానం రాకుండా విక్రయించేవాడు.

రూ. 1.5 లక్షల సరుకు స్వాధీనం..

గత కొన్ని రోజులుగా కాప్రా పరిసరాల్లో ఈ అక్రమ వైన్ విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు ఆంటోనీ పీటర్ నివాసంపై మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు 377 లీటర్ల వైన్, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 502 వైన్ సీసాలు గుర్తించారు.

వీటితోపాటు వైన్ తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్స్, డ్రమ్ములు తదితర పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ మొత్తం సామాగ్రి విలువ సుమారు రూ. 1.5 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

బాటిల్ రూ. 300.. నిబంధనల ఉల్లంఘన..

అధికారుల విచారణలో ఆంటోనీ పీటర్ ఒక్కో 750 మి.లీ. (ml) వైన్ బాటిల్‌ను రూ. 300 చొప్పున కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

ఎలాంటి ల్యాబ్ పరీక్షలు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా ఇళ్ల మధ్య కెమికల్స్ ఉపయోగించి మద్యం లేదా వైన్ తయారు చేయడం ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions