TGSRTC Doorstep Bus Pickup దసరా పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ‘డోర్స్టెప్ పికప్’ (Doorstep Bus Pickup) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాలనీలు, టౌన్షిప్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి ఒకే ప్రాంతానికి ప్రయాణించే 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే, వారి ఇంటి వద్దకే నేరుగా ఆర్టీసీ బస్సును పంపించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
సమయం, డబ్బు ఆదా..
బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఆటో, టాక్సీ ఖర్చులు ఆదా అవ్వడమే కాకుండా, సమయం కలిసి వస్తుంది. బస్టాండ్లో బస్సు మిస్ అవుతుందనే ఆందోళన లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. కాలేజీలు, హాస్టళ్ల వద్ద ఉన్న విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నేరుగా అక్కడి నుంచే ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు.
ఏరియాల వారీగా బుకింగ్ కాంటాక్ట్ నంబర్లు..
బుకింగ్ మరియు సమాచారం కోసం ఆర్టీసీ ఏరియాల వారీగా ప్రత్యేక ఫోన్ నంబర్లను కేటాయించింది.
- సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్రావు నగర్, తార్నాక, ఉప్పల్, రేతిఫైల్ ప్రాంతాలు:📱 99592 26142 (సికింద్రాబాద్ డీఆర్ఎం)
- కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్, పటాన్చెరు, బీరంగూడ, దుండిగల్ ప్రాంతాలు:📱 99562 26148
- దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, బడంగ్పేట్, ఆదిభట్ల, మిధాని, సరూర్నగర్ ప్రాంతాలు:📱 99892 26136










