Tuesday 6th October 2026
12:07:03 PM
Home > తాజా > “మాజీ మావోయిస్టులు పార్టీలోకి రండి”.. కవిత సంచలన పిలుపు!

“మాజీ మావోయిస్టులు పార్టీలోకి రండి”.. కవిత సంచలన పిలుపు!

Kalvakuntla Kavitha Vemulawada Visit | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజలకు సేవ చేయడానికి తమ పార్టీలో చేరాలని బహిరంగంగా ఆహ్వానించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాజీ మావోయిస్టులకు ఆహ్వానం.. కవిత కీలక వ్యాఖ్యలు..

“అడవిని వదిలేసి వచ్చిన మాజీ మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రండి.. ప్రజాసేవ చేసేందుకు మా తెలంగాణ రక్షణ సేన పార్టీ మంచి ప్లాట్‌ఫామ్” అని కవిత పిలుపునిచ్చారు. వారి రాకతో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆలయ నిర్మాణంలో కాంక్రీట్ వాడకంపై ఆగ్రహం..

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులలో కాంక్రీట్ వాడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు ఆగమశాస్త్రం ప్రకారం కృష్ణశిలలతోనే నిర్మిస్తే ఆలయం వందల ఏళ్ల పాటు నిలుస్తుందని డిమాండ్ చేశారు.

ఆలయంలో భక్తులు సమర్పించిన కోడెలు/గోవులు సరిపడా మేత, నీరు లేక మరణిస్తున్నాయని, కనీసం వాటికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..

కాంగ్రెస్ ప్రభుత్వం దిశానిర్దేశం కోల్పోయిందని, అందుకే ప్రజలు తమలాంటి నూతన పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సిరిసిల్ల-వేములవాడ ప్రాంతంలో సాగునీటి పనులు వెంటనే చేపట్టాలని కోరారు.

You may also like
2029 నాటికి ‘నషా ముక్త భారత్’: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
తెలుగు వారి ‘బ్లూ బుల్లెట్’ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు!
నాతో పెట్టుకోకు.. కేటీఆర్ విమర్శలకుకవిత సంచలన కౌంటర్!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions