Monday 5th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > లైంగిక వేధింపుల కేసులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!

లైంగిక వేధింపుల కేసులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!

supreme court

Supreme Court Warning On Sexual Crimes లైంగిక నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తుల మనస్సుల్లో తీవ్రమైన ‘భయాన్ని’ కలిగించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నేరం చేస్తే ఖచ్చితంగా మరణశిక్ష పడుతుంది లేదా చావు తప్పదు (“ఇక ఏదైనా చేస్తే చచ్చిపోతాం”) అనే భయం క్రిమినల్స్‌లో కలగనంత వరకు ఇలాంటి ఘోరమైన నేరాలను అరికట్టలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల మైనర్ బాలికపై స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం వంటి దారుణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా (Suo Motu) ఈ విచారణను చేపట్టింది.

కళాశాలలు, అక్రమ ఈటరీలపై నిఘా..

అమ్మాయిలను వేధించే ‘గుండాలు’ తిరిగే కళాశాలల ప్రాంతాలపై ముందుగా దృష్టి పెట్టాలని, ఆ తర్వాత ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న వేలాది అక్రమ ఆహార విక్రయ కేంద్రాలపై (Eateries) నిఘా పెట్టాలని కోర్టు చెప్పింది. అక్కడ అసాంఘిక శక్తులు చేరి మద్యం సేవిస్తున్నారని తెలిపింది. జస్టిస్ జె.బి. పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం 2012 నాటి నిర్భయ కేసును గుర్తుచేస్తూ.. ఆ నాటి దోషులు కూడా ఆ అమానుష నేరానికి పాల్పడే ముందు మద్యం సేవించారని పోలీసులకు గుర్తుచేసింది.

‘వార్ రూమ్’ ఏర్పాటు ప్రక్రియ..

ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటుపై సమాచారం కోరింది. లైంగిక నేరస్తుల జాతీయ డేటాబేస్ (NDSO) ఆధారంగా అనుమానితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. దక్షిణ ఢిల్లీలో మహిళా కళాశాలకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్కులో జరిగిన సామూహిక అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ.. నేరస్థుల గురించి ప్రజలు ముందే హెచ్చరించినా పోలీసులు ఎందుకు అప్రమత్తం కాలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రజల నిరసనలకు బెదరొద్దు – మహిళల భద్రత ముఖ్యo..

కఠిన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రజల నుంచి నిరసనలు లేదా వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఢిల్లీ పోలీసులు తమ విధి నిర్వహణ నుంచి వెనక్కి తగ్గకూడదని కోర్టు స్పష్టం చేసింది. “యువతులు మరియు మహిళల భద్రత కోసం మనం ఇది కచ్చితంగా చేయాలి. రాబోయే నాలుగు వారాల్లో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకూడదు” అని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

You may also like
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
generative ai services in hyderabad police
పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions