Monday 28th September 2026
12:07:03 PM
Home > తాజా > నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల!

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల!

TGPSC Exam Schedule Released తెలంగాణలోని ఉద్యోగార్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలన్నింటినీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలోనే నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.

విభాగాల వారీగా పరీక్ష తేదీల వివరాలు:

విభాగం / శాఖఉద్యోగాల పేరుపరీక్ష తేదీలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)అసిస్టెంట్ సైంటిస్ట్అక్టోబర్ 24
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్అక్టోబర్ 26
ఆర్ అండ్ బీ (R&B) శాఖఅసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)నవంబర్ 6, 7
పాఠశాల విద్యాశాఖడీఈవో (DEO) & గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1నవంబర్ 12, 13

CBT విధానంలోనే పరీక్షలు..

ప్రకటించిన అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత విధానంలోనే (CBT) పరీక్షలు జరుగుతాయి. పరీక్ష తేదీలు ఖరారు కావడంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు. హాల్ టిక్కెట్లు, ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్‌ www.tgpsc.gov.in సందర్శించాలని అధికారులు సూచించారు.

You may also like
కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్!
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions