Kavitha Counter To KTR బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో కేటీఆర్, కవితల మధ్య పరస్పర కౌంటర్లు పతాక స్థాయికి చేరాయి. తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకే పెత్తనం ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు.
పార్టీలో అవినీతిని ప్రశ్నించినప్పుడు తనపై వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు. మరి పార్టీ అధినేత కేసీఆర్ గారి నిర్ణయాలను బాహాటంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా అని ఎక్స్ వేదికగా కవిత నిలదీశారు. మీ ఫామ్ హౌస్ లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని.. మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే… ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా? నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు… నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు! అని వార్నింగ్ ఇచ్చారు కవిత.










