Tuesday 15th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అంబేడ్కర్ పై వ్యాఖ్యలు..అమిత్ షా పై విపక్షాలు కన్నెర్ర

అంబేడ్కర్ పై వ్యాఖ్యలు..అమిత్ షా పై విపక్షాలు కన్నెర్ర

Amit Shah Remarks On Ambedkar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్. అంబేడ్కర్ ( BR Ambedkar ) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాల డిమాండ్ తో బుధవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది.

మరోవైపు పార్లమెంటు ప్రాణగణంలో ఇండీ కూటమి ( INDI Alliance ) ఎంపీలు అమిత్ షా కు వ్యతిరేకంగా నినదించారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని పట్టుకుని జై భీం అని నినాదాలు చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారికి అంబేడ్కర్ సిద్ధాంతాలతో సమస్య ఉంటుందని బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు.

దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్, ఆయన రుపొందించిన రాజ్యాంగాన్ని అవమానించడాన్ని దేశం సహించదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions