Sunday 16th August 2026
12:07:03 PM
Home > తాజా > రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన సీఎం రేవంత్

రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన సీఎం రేవంత్

Cm Revanth Reddy Attend Chalo Rajbhavan Rally | తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అదాని ఆర్ధిక అవకతవకలపై మరియు మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టి కాంగ్రెస్ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఈ అంశాలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ప్రదర్శనగా ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు బయలుదేరారు.

పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట బైఠాయించిన సీఎం రేవంత్ కేంద్రం, బీజేపీ వ్యతిరేకంగా నినదించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions