జిల్లెల్ గూడ: తిరుమల నగర్ కాలనీలో భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీలోని హరిహర క్షేత్రం ఆలయ సమీపంలో కాలనీ వాసులు జాతీయ జెండా ఎగురవేశారు.
హరిహర క్షేత్రం ఆలయ చైర్మన్ వాసు ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా వాసు ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. తిరుమల నగర్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హరిహర క్షేత్రంలో దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు..
తిరుమల నగర్ కాలనీలోని హరిహర క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి విగ్రహం, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన మహోత్సవాలను సెస్టెంబర్ 1 నుంచి 5 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు వాసు ప్రసాద్ వెల్లడించారు. ఈ వేడుకల్లో తిరుమల నుంచి స్వాములు విచ్చేయనున్నట్లు చెప్పారు.
ఈ ఆలయ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కాలనీ వాసులు అందరూ తప్పనిసరిగా తమ వంతు సాయం అందించాలని కోరారు. సమష్టిగా కృషి చేసి కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు రమణ రాజు, శివ కుమార్, హేమాచలం, ముద్దగోని రామకృష్ణ, ప్రభులింగం, కాశీనాథ్, సత్యనారాయణ, సాయి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.











