Wednesday 30th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికా గ్రీన్ కార్డ్ లవర్స్‌కు బిగ్ షాక్!

అమెరికా గ్రీన్ కార్డ్ లవర్స్‌కు బిగ్ షాక్!

  • EB-5 వీసా ఫీజులు రెట్టింపు పైనే పెంపు!

USCIS EB-5 Green Card Fee Hike అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) పొందాలనుకునే భారతీయ పెట్టుబడిదారులకు నిరాశ కలిగించే వార్త. EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి ఫీజులను భారీగా పెంచుతూ US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 30 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రాథమిక దరఖాస్తు రుసుములను ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ చేశారు.

ఫాంల వారీగా పెరిగిన ఫీజుల వివరాలు..

ఫాం I-526 (స్వతంత్ర పెట్టుబడిదారులు): రుసుము 3,675 డాలర్ల నుండి 7,615 డాలర్లకు పెరిగింది. ఫాం I-526E (ప్రాంతీయ కేంద్రాల ద్వారా): రుసుము 3,675 డాలర్ల నుండి 7,850 డాలర్లకు పెరిగింది. వీటికి అదనంగా 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు, ఇన్వెస్టర్ ఇంటిగ్రిటీ ఫీజు కూడా ఉంటాయి.

ఫాం I-829 (షరతుల తొలగింపు): రుసుము 3,750 డాలర్ల నుండి 5,000 డాలర్లకు పెరిగింది. ప్రాంతీయ కేంద్రాల ఛార్జీలు (I-956 & I-956F): ఫాం I-956 ఫీజు 17,795 డాలర్ల నుండి 44,115 డాలర్లకు, ఫారమ్ I-956F రుసుము 17,795 డాలర్ల నుండి 42,675 డాలర్లకు పెరిగింది. ఫాం I-527 (పాత పిటిషన్ల సవరణ): కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫైలింగ్ రుసుము 10,330 డాలర్లుగా నిర్ణయించారు.

ఫీజుల పెంపునకు USCIS చెప్పిన హేతుబద్ధత..

తమ ఏజెన్సీ కార్యకలాపాలకు ప్రభుత్వ పన్నుల నిధులు అందవని USCIS స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలన, తనిఖీలు మరియు మోసాల గుర్తింపు ఖర్చులను ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఉపయోగించే వారే భరించాలని తెలిపింది. అమెరికాలో కనీసం 10 పూర్తి-స్థాయి ఉద్యోగాలను సృష్టించే వ్యాపారాల్లో 8,00,000 డాలర్లు లేదా 1.05 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే వారికి EB-5 ప్రోగ్రామ్ ద్వారా గ్రీన్ కార్డ్ ఇస్తారు. భారతదేశం నుండి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఈ వీసాల కోసం వేచి ఉండే కాలం కూడా పెరిగింది.

You may also like
h1b visa process
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions