Friday 18th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం రేవంత్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..శ్రీకాళహస్తిలో తెలంగాణ భవన్

సీఎం రేవంత్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..శ్రీకాళహస్తిలో తెలంగాణ భవన్

Bojjala Sudhir Reddy Meets Cm Revanth Reddy | తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి ( Jhansi Reddy )ని హైదరాబాద్ లోని వారి నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు.

అనంతరం, శ్రీకాళహస్తి ( Srikalahasthi )లో తెలంగాణ భవన్ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించారు. శ్రీకాళహస్తి దేవస్థానంను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కంకణబద్దులైవున్నట్లు సీఎంకు సుధీర్ రెడ్డి వివరించారు.

ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో అతిధి గృహాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అందుకోసం దేవస్థానం పరిసర ప్రాంతంలో అర్ద ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాళహస్తిలో తెలంగాణ అతిధి గృహం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions