- వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
Virender Sehwag Post On July Born Captains | టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, విద్వంసకర బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తనదైన శైలిలో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుంటారనే విషయం తెలిసిందే.
తాజాగా ఆయన క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా ఒక ఆసక్తికరమైన ‘బర్త్ డే లాజిక్’ పోస్ట్‌ను షేర్ చేశారు.
భారత క్రికెట్ చరిత్రను శాసించిన దిగ్గజ కెప్టెన్లకు, జులై నెలకు ఉన్న ఒక వింతైన సెంటిమెంట్‌ను ఆయన బయటపెట్టారు.
జులై నెలలో పుట్టినవారికి టీమ్ ఇండియాకు ఐకానిక్ కెప్టెన్లుగా మారే అద్భుతమైన అవకాశం ఉందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పారు.
జులై ‘కెప్టెన్ల’ లిస్ట్ ఇదే..
భారత క్రికెట్‌ను అగ్రపథాన నిలిపిన ముగ్గురు దిగ్గజ కెప్టెన్ల పుట్టినరోజులు వరుస రోజుల్లో (బ్యాక్ టు బ్యాక్) రావడం విశేషం. ఆ లిస్ట్ ను సెహ్వాగ్ ఇలా గుర్తుచేశారు..
జులై 7: టీమ్ ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు (2007 టీ20, 2011 వన్డే), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన లెజెండరీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోని (MS Dhoni) బర్త్ డే.
జులై 8: టీమ్ ఇండియాకు దూకుడు నేర్పి, విదేశాల్లో గెలవడం నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బర్త్ డే.
జులై 10: భారత క్రికెట్ చరిత్రలో డిఫెన్స్ కు మారుపేరుగా నిలిచి, జట్టును ముందుండి నడిపిన ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) బర్త్ డే.
‘జులై 9’ మిస్సింగ్.. కానీ అక్కడే ఉంది ట్విస్ట్!
ఈ వరుస క్రమంలో జులై 7, 8 ల తర్వాత 10 వచ్చింది కానీ.. ‘జులై 9’ మిస్ అయింది. దీనిపైనే వీరూ తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు.
“ఈ క్రమంలో జులై-9 మిస్ అయింది. కానీ నాదో చిన్న జోస్యం.. భవిష్యత్ టీమ్ ఇండియా కెప్టెన్, భారత క్రికెట్ తదుపరి ఐకాన్ ప్లేయర్ బహుశా ఈ జులై 9నే పుట్టే అవకాశం ఉంది..
లేదా ఇప్పటికే జన్మించి ఉంటాడు! కాబట్టి.. జులై లో జన్మించండి.. కెప్టెన్లు అయిపోండి” అని సెహ్వాగ్ పోస్ట్ చేశారు.
వీరూ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు కూడా “జులై నెలకు క్రికెట్ కెప్టెన్లకు ఏదో విడదీయరాని బంధం ఉంది బాస్”, “జులై 9న పుట్టిన ఆ కాబోయే కెప్టెన్ ఎవరో చూడాలి” అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.







