Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > క్వీన్ ఎలిజబెత్ తర్వాత అరుదైన గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ

క్వీన్ ఎలిజబెత్ తర్వాత అరుదైన గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీ

Nigeria To Honor Pm Modi With GCON Award | భారత దేశ ప్రధాని నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ( Commonwealth Of Dominica ) తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజగా నైజీరియా ( Nigeria ) ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి ప్రకటించింది. ‘ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్’ గ్రాండ్ కమాండర్ ను ప్రధానికి అందించనున్నారు. నైజీరియా దేశాధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ప్రధాని ఆదివారం నైజీరియా చేరుకున్నారు.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా 1969లో క్వీన్ ఎలిజబెత్ ( Queen Elizabeth )కు నైజీరియా ఈ అవార్డును ప్రధానం చేసింది.

ఆమె తర్వాత ఈ అవార్డును అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ ఘనతను సొంతం చేసుకున్నారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions