Saturday 15th August 2026
12:07:03 PM
Home > తాజా > తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..జైలుకెళ్లిన నటి

తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..జైలుకెళ్లిన నటి

Actress Kasthuri Arrested | తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో ఆమె పై తమిళనాడు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. తనకు ముందస్తు బెయిల్ ( Bail ) కావాలని కస్తూరి వేసిన పిటిషన్ ను మధురై కోర్టు తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని ఓ నిర్మాత ఇంట్లో తమిళనాడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ( Egmore Metropolitan Court ) లో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు 12 రోజులపాటు రిమాండ్ విధించింది.

దింతో నటి కస్తూరిని పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి కస్తూరి న్యాయాన్ని గెలిపించండి అంటూ అరిచారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions