- నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ గిఫ్ట్ వీడియో!
PM Modi gifts Melody chocolates to Giorgia Meloni | అంతర్జాతీయ వేదికలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కలిశారంటే చాలు.. సోషల్ మీడియాలో ‘మెలోడీ’ (Melodi) హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. వీరిద్దరి పేర్లను కలుపుతూ నెటిజన్లు సృష్టించిన ఈ ట్రెండ్ తాజాగా అక్షరాలా నిజమైంది.
ఐదు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనిని కలిసిన తరుణంలో ఒక ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. భారత్‌లో దశాబ్దాలుగా ఎంతో ఫేమస్ అయిన ‘మెలోడీ’ (Melody) టాఫీ (చాక్లెట్) ప్యాకెట్లను ప్రధాని మోదీ ఆమెకు బహుమతిగా ప్రజెంట్ చేశారు.
సర్ప్రైజ్ గిఫ్ట్‌కు మెలోని ఫిదా ..
నెటిజన్ల క్రియేటివిటీని ప్రధాని మోదీ ఇంతలా గుర్తుపెట్టుకుని, స్వయంగా ఆ బ్రాండ్ చాక్లెట్లనే గిఫ్ట్ గా ఇవ్వడం చూసి జార్జియా మెలోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అద్భుతమైన ఆత్మీయ ఆతిథ్యానికి, సర్ప్రైజ్ గిఫ్ట్ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మెలోని తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఒక ప్రత్యేక వీడియోను, పోస్ట్ ను షేర్ చేశారు.
నెట్టింట ‘మెలోడీ’ పూనకాలు.. “మెలోడీ చాక్లెట్ తింటే.. ఇంత క్యూట్ గా ఎందుకుంటుందో ఇన్నాళ్లకు తెలిసింది” అంటూ నెటిజన్లు పాత యాడ్ లైన్లను వాడుతూ ఈ వీడియోను విపరీతంగా ట్రోల్ అండ్ షేర్ చేస్తున్నారు.
గ్లోబల్ లీడర్స్ మధ్య అరుదైన బాండింగ్…
గతంలో జరిగిన జీ20 (G20), జీ7 (G7) సదస్సుల సమయంలో కూడా మోదీ-మెలోనిల సెల్ఫీలు, ఆత్మీయ పలకరింపులు అంతర్జాతీయంగా హెడ్‌లైన్స్ లో నిలిచాయి. సాధారణంగా దేశాధినేతలు కలిసినప్పుడు ఖరీదైన పురాతన వస్తువులు, సాంస్కృతిక ప్రతీకలను బహుమతిగా ఇస్తుంటారు.
కానీ ఇలా ఒక పాపులర్ సోషల్ మీడియా ట్రెండ్‌ను గౌరవిస్తూ చాక్లెట్లు ఇవ్వడం ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఒక అరుదైన మరియు వినూత్నమైన ఘట్టం.
ఈ సరదా వాతావరణం భారత్-ఇటలీ దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహసంబంధాలను, ఇద్దరు గ్లోబల్ లీడర్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







