Alla Ramakrishna Reddy Resign | ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ముఖ్యనేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. రామకృష్ణారెడ్డి సోమవారం తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత విధేయుడైన ఆర్కే రాజీనామా ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కేకు మంగళగిరి నుంచి టికెట్ దక్కదనే సందేహాలతోనే ఆయన రాజీనామా చేసినట్ల తెలుస్తోంది.
మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గంజి చిరంజీవిని కొత్త ఇంచార్జీగా నియమిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చాలా రోజుల నుంచి ఆర్కే చెబుతూవస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చింది అన్నది చర్చనీయాంశంగా మారింది.