Thursday 15th October 2026
12:07:03 PM
Home > తాజా > దొంగకు వచ్చిన కష్టం..కన్నంలో ఇరుక్కుని

దొంగకు వచ్చిన కష్టం..కన్నంలో ఇరుక్కుని

Rajasthan thief stuck in kitchen exhaust shaft during robbery | రాజస్థాన్ రాష్ట్రం కోటాలో ఓ దొంగకు ఊహించని ఘటన ఎదురైంది. చోరీ కోసం వచ్చిన దొంగ ఓ కన్నంలో ఇరుక్కుపోయాడు. బయటపడడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి పోలీసులు వచ్చి చిన్నపాటి ఆపరేషన్ చేపట్టి దొంగను సురక్షితంగా కాపాడారు. ఆ వెంటనే స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోటాలో ఓ ఇంట్లో ఎవరూ లేరని దొంగ గమనించాడు. దింతో చోరీ చేయడానికి సిద్ధం అయ్యాడు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ కన్నం నుంచి ఇంట్లోకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ కన్నం మధ్యలోనే ఇరుక్కుపోయాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటి యజమాని వచ్చారు. కన్నంలో ఉన్న దొంగను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు గంటపాటు కష్టపడి కన్నంలో వేలాడుతున్న దొంగను బయటకు తీశారు. అనంతరం అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions