Saturday 23rd May 2026
12:07:03 PM
Home > క్రీడలు > IND vs PAK..రూల్స్ కు వ్యతిరేకంగా ప్రియురాలితో హార్దిక్

IND vs PAK..రూల్స్ కు వ్యతిరేకంగా ప్రియురాలితో హార్దిక్

Hardik Pandya takes BIG step against BCCI | టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా హై వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమయ్యింది. ఎన్నో వివాదాలు, మరెన్నో ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు ఆదివారం శ్రీలంకలోని కొలంబో వేదికగా టీం ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు తన ప్రియురాలితో హార్దిక్ పాండ్య కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొలంబో లోని ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ లో హార్దిక్ తన ప్రియురాలు మహిక శర్మతో కలిసి కనిపించారు.

అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులు లేదా ప్రియురాళ్లతో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉండాలని అనుకున్నా సొంత ఖర్చులతో వేరే హోటల్ లో బస చేయాల్సిందే. అయినప్పటికీ హార్దిక్ పాండ్య మాత్రం ఇలా టీం ఇండియా జట్టు బస చేస్తున్న హోటల్ లో ప్రియురాలితో కనిపించారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాలి.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions