Wednesday 29th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రైలు ఆలస్యంతో నీట్ ఎగ్జామ్ కు గైర్హాజరు.. రైల్వేపై రూ. 9 లక్షల జరిమానా!

రైలు ఆలస్యంతో నీట్ ఎగ్జామ్ కు గైర్హాజరు.. రైల్వేపై రూ. 9 లక్షల జరిమానా!

rs 9 lakh fine for indian railways

– రైల్వేపై రూ. 9 లక్షల జరిమానా!

Rs 9 Lack Fine For Indian Railways | రైలు ఆలస్యం కారణంగా నీట్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రాయలేకపోయిన విద్యార్థినికి ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత న్యాయం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ (Basti) జిల్లా వినియోగదారుల కమిషన్, భారత రైల్వేలపై రూ.9 లక్షల పరిహారం విధించింది. అదనంగా కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.. బస్తీ జిల్లా గాంధీ నగర్ పికౌరా బక్ష్‌కు చెందిన సమృద్ధి సింగ్ (Samruddhi Singh), 2018 మే 7న లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాలలో నిర్వహించిన నీట్ (NEET) పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ రైలులో టికెట్ బుక్ చేసుకుంది.

ఉదయం 11 గంటలకు చార్‌బాగ్ చేరాల్సిన రైలు, మధ్యాహ్నం 1:34కు చేరడంతో ఆమె పరీక్షను కోల్పోయింది. ఫలితంగా ఒక విద్యా సంవత్సరం నష్టం వాటిల్లింది.

రైల్వే అధికారులకు పంపిన నోటీసులకు స్పందన లేకపోవడంతో ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.

విచారణలో ఆలస్యం జరిగినట్టు రైల్వేలు అంగీకరించినా సరైన కారణాలు చూపలేకపోయాయి. 45 రోజుల్లోగా మొత్తం రూ.9.10 లక్షలు చెల్లించాలని, ఆలస్యం అయితే 12 శాతం వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.

You may also like
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions