Saturday 9th August 2025
12:07:03 PM
Home > తాజా > విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

Janwada Farmhouse Party News | జన్వాడ లోని రిజర్వ్ కాలనీలోని రాజ్ పాకాల ( Raj Pakala )ఫార్మ్ హౌస్ లో శనివారం రాత్రి భారీ శబ్దాలతో పార్టీని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటి ( Cyberabad SOT )పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పాల్గొన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కోకైన్ తీసుకున్నట్లు నిర్దారించారు. ఈ క్రమంలో NDPS చట్టం కింద కేసును నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగానే రాజ్ పాకాలకు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫార్మ్ హౌస్ కేసుకు సంబంధించి కేటీఆర్ ( KTR ) బావమరిది రాజ్ పాకాల బుధవారం మోకిల పోలీసుల ఎదుట హాజరయ్యారు. న్యాయవాదితో పాటు రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో జన్వాడ ఫార్మ్ హౌస్ పార్టీకి సంబంధించి పోలీసులు విచారిస్తున్నారు.

You may also like
‘ది ప్యారడైజ్’..’జడల్’ గా రాబోతున్న నాని
‘కీళడి’ కోసం..ప్రధానిని కలిసిన కమల్ హాసన్
‘వావివరుసలు లేవు..సొంత కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేశారు’
‘ఐదు రకాల ఓట్ల చోరీ’..ఈసీపై రాహుల్ సంచలన ఆరోపణలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions