Sunday 20th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కళ్యాణ్ శాఖలు ఇవే!

మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కళ్యాణ్ శాఖలు ఇవే!

pawan kalyan

Pawan Kalyan Portfolios | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల హామీ మేరకు మెగా డీఎస్సీతోపాటు మరో నాలుగు ఫైళ్లపై సంతకం చేశారు.

తాజాగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేసిన 24 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు. దీంతోపాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలు కేటాయించారు.

ఇక నారా లోకేశ్ కు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తో పాటు మానవ వనరుల అభివృద్ధి శాఖలు అప్పజెప్పారు.

జనసేన పార్టీ నుంచి నాదేండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, కందుల దుర్గేశ్ కు టూరిజం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు చంద్రబాబు. కాగా కీలకమైన హోంశాఖ బాధ్యతలను వంగలపూడి అనితకు అప్పగించారు.

You may also like
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి గాయాలు!
harihara veera mallu
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !
pawan and vh
ఏపీ డిప్యూటీ సీఎంతో కాంగ్రెస్ సీనియర్ నేత భేటీ!
modi pawan
హిమాలయాలకు వెళ్తున్నారా పవన్: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions