Wednesday 29th July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

pawan kalyan

Pawan Kalyan Visists Kondagattu | ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM), జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం తెలంగాణలో పర్యటించారు.  ఆయన టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu Temple) ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రూ.35.19 కోట్లతో కొండగట్టులో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి తన వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

You may also like
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
pawan annamalai
పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయంఅన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions