Chiranjeevi Review On OG | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్ (Sujith) కాంబోలో తెరకెక్కిన చిత్రం ఓజీ(OG).. ఇటీవల విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓజీ సినిమా వీక్షించారు.
సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై రివ్యూ పోస్ట్ చేశారు. ”OG సినిమాని నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూశాను. మూవీలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా అద్భుతంగా చిత్రీకరించిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది.
సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు, ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో తెరకెక్కించిన డైరెక్టర్ సుజీత్‌కు అభినందనలు. కళ్యాణ్ బాబును తెరపై చూడటం చాలా గర్వంగా అనిపించింది. అతను తన స్వాగ్ తో సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాడు.
ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు సరైన విందు అందించాడు” అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మెగాఫ్యామిలీ ఓజీ సినిమా వీక్షించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









