Telangana High Court Stays 42% BC Quota in Local Body Polls Telangana | బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 9ని జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ జీవో పై రాష్ట్ర హైకోర్టు తాజగా స్టే విధించింది.
జీవో నంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో జీవో అమలును కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు, ఆ తర్వాత కౌంటర్లపై అభ్యంతరాలు తెలిపేందుకు పిటిషనర్లకు రెండు వారాలు గడువు ఇచ్చింది.
ఇదిలా ఉండగా గురువారం నుంచే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలయ్యింది. ఇదే సమయంలో జీవో నంబర్ 9పై కోర్టు స్టే విధించింది. న్యాయస్థానం ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి.









