Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > “ఓటుకు రూ.10,000 పంపాడు.. తక్కువ ఇస్తే నిలదీయండి”: రేవంత్ రెడ్డి

“ఓటుకు రూ.10,000 పంపాడు.. తక్కువ ఇస్తే నిలదీయండి”: రేవంత్ రెడ్డి

Revanth reddy

Revanth Reddy Sensational Comments | తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) బీఆరెస్, బీజేపీ లపై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.

శనివారం నాడు మీడియా తో మాట్లాడిన ఆయన బీఆరెస్-బీజేపీ బంధంపై ఆరోపణలు చేశారు.

పోలింగ్ కు నాలుగు రోజులు ఉండగా రైతు బంధు నిధులు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా బీజేపీ, బీఆరెస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో రైతులకు రూ.5 వేలు నష్టం జరుగుతోందని అలాగే కౌలు రైతులు, రైతు కూలీలు పూర్తిగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.

రైతులు ఆందోళన చెందొద్దని, కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి, కాంగ్రెస్ వచ్చాక తాము ఇవ్వాల్సింది ఇస్తామని స్పష్టం చేశారు.

ఎన్ని కుట్రలు చేసినా, మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ నేతలపై మాత్రమే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

ఓటుకు పదివేలు ఇవ్వడానికి కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులకు డబ్బులు పంపించారని, పదివేలకు ఒక్క రూపాయి తక్కువ ఇచ్చినా బీఆరెస్ వారిని నిలదీయండి అంటూ పిలుపునిచ్చారు రేవంత్.

You may also like
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions