Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రష్యాలో భారీ భూకంపం.. భారత్ కు సునామీ పొంచి ఉందా.. ‘ఇన్ కాయిస్’ క్లారీటీ!

రష్యాలో భారీ భూకంపం.. భారత్ కు సునామీ పొంచి ఉందా.. ‘ఇన్ కాయిస్’ క్లారీటీ!

tsunami

Tsunami in Russia | రష్యాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కమ్చాట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరంలో 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేలుపై  8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతో పాటు జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకింది.

అమెరికాలోనూ హెచ్చరిక‌లు ఇచ్చారు. హ‌వాయి ద్వీపంలో అప్రమ‌త్తత ప్రక‌టించారు. ఈ క్రమంలో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై  ఇండియన్ నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్‌కాయిస్ స్పందించింది.

భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్ప‌ష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి సునామీ ముప్పు లేదని తెలిపింది. ఈ మేరకు ఇన్‌కాయిస్ ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

“కమ్చాట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్ర‌త‌తో భూకంపం సంభవించింది. దీంతో తీర ప్రాంతంలో సునామీ వచ్చింది. అయితే, దీని కార‌ణంగా భార‌త్‌కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు” అని ఇన్‌కాయిస్ పోస్ట్ చేసింది.    

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions