Saturday 27th July 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కోటీశ్వరుడైన టమాట రైతు…!

tomato farmer became millionaire

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి వాళ్ళు టమాటాల వైపు చూడటమే మానేశారు. దేశంలో డిమాండ్ కు సరిపడా టమాటాలు అందుబాటులో ఉండకపోవడం మూలంగా ధరలు పెరుగుతున్నాయి.

దేశంలో సగటున టమాటా ధర రూ.150 పైనే ఉంది. కానీ ఇలాంటి సమయంలో టమాటాలను సాగు చేస్తున్న రైతులు మాత్రం లాభాలు గడిస్తున్నారు.

ఇలా టమాటాలు విక్రయించడం ద్వారా మహారాష్ట్ర రైతు ఏకంగా నెలరోజుల్లో కోటీశ్వరుడు అయ్యాడు.మహారాష్ట్ర లోని పూణే జిల్లాలో తుకారాం భాకోజి గయాకర్ అనే రైతు నెలరోజుల్లో 13,000 టమాటా బాక్సులను విక్రయించడం ద్వారా రూ.1.5 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు.

తుకారాంకు 18 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటా పంటను సాగు చేస్తున్నాడు. కుమారుడు ఈశ్వర్ గాయాకర్, కోడలు సోనాలి సహకారంతో మంచి ఎరువులు వాడటం వలన టమాటా దిగుబడి బాగా వచ్చింది.

గయాకర్ శుక్రవారం 900 బాక్సులను అమ్మడం ద్వారా ఒక్కరోజే రూ.18 లక్షలను సంపాదించాడు. గత నెలలో టమాటాల నాణ్యత ఆధారంగా ఒక్కో బాక్స్ రూ.1000 నుండి రూ.2,400 వరకు విక్రయించగలిగాడు.

పూణే జిల్లా జున్నూర్ లో టమాటాలు పండిస్తున్న చాలా మంది రైతులు కోటీశ్వరులుగా మారారు.
ఈ కమిటీ టమాటా విక్రయం ద్వారా నెల రోజుల్లో రూ.80 కోట్ల వరకు వ్యాపారం చేసి చాలా మంది రైతులు కోటీశ్వరులుగా మారారు. అలాగే వెయ్యికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

తుకారాం కోడలు సోనాలి పంట సాగు, టమాటాలను కోయడం, ప్యాకేజింగ్ తదితర పనులు నిర్వహిస్తుండగా, కొడుకు ఈశ్వర్ విక్రయా నిర్వహణ చూస్తుంటాడు.

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు పెరగడం వలన మంచి నాణ్యతతో కూడిన తుకారాం టమాటాలకు మంచి ధర లభించి వారి కష్టానికి ప్రతిఫలం లభించింది.కేవలం మహారాష్ట్రలోనే గాక కర్ణాటకలోని టమాటా రైతులు మంచి లాభాలను గడిస్తున్నారు.

ఒకవైపు టమాటా ధరలు పెరగడం వలన సామాన్యులు ఇబ్బంది పడినా, రైతులు మాత్రం లాభాలను గడించడం సంతోషకరమైన విషయం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions